బాన్సువాడ టౌన్ ప్రజా గళం: బాన్సువాడ నియోజకవర్గం లోని ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో నెహ్రు యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన క్లస్టర్ ఆఫ్ బ్లాక్ స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడా పోటీలు మూడు రోజులపాటు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల్లో వాలిబాల్ , బ్యాట్ మెంటైన్ (బాయ్స్ ) పోటీలలో ఎస్ ఆర్ ఎన్ కె విద్యార్థులు విజయం సాధించారు. కబడ్డీ లో ఎస్ ఎస్ ఎల్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు, మెమొంటోస్ ను అందజేశారు . ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం వాలంటీర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్ధేశంతో నెహ్రు యువకేంద్రం క్రీడలను నిర్వహించడం జరుగుతుందని, యువతను ఫిట్ ఇండియాగ తయారు చేయడమే నెహ్రు యువకేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, త్వరలో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయి ఆ పోటీలకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలకు ఎస్ ఆర్ ఎన్ కె కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి బహుమతులు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో స్పోర్ట్ ఇంచార్జ్ చిరంజీవి, ఎన్ సి సి ఇంచార్జ్ కృష్ణ రాథోడ్, వినయ్, భగవాన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

