నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
బిఆర్ఎస్ నాయకులే అవినీతికి పట్టభద్రులు అని ధర్పల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి అన్నారు. బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బి ఆర్ ఎస్ నాయకులకు ఏమి పని లేక ప్రస్తుతం మంచిగా పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదట మొట్టమొదట అరెస్టు చేసిన ఆస్తులు జీవన్ రెడ్డివి అని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ బినామీ పేరు మీద కట్టి లీజుకు తీసుకున్నట్లు రాసుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా బ్యాంకులో నుండి పలుకుబడి ఉపయోగించి కోట్లాది రూపాయలు అప్పు తీసుకుని కాంప్లెక్స్ కట్టి న నాటి నుండి మొన్నటి వరకు కరెంటు బిల్లులు ఆర్టీసీ అద్దెలు కట్టలేదని ఆర్టీసీ కాంప్లెక్స్ ను సీజ్ చేసిన సంగతి మరిచారా అని గుర్తు చేశారు. ఇతరులను దేప్పి పొడిచేఎందుకు ఒకటే వేలు చూపుడు వేలు ప్రయోగిస్తాము మిగతా నాలుగు వేలు నీదిక్కే ఉంటాయి అంటే నీవే నాలుగవంతలు ఎక్కువ చీటర్ అని అర్థం అని అన్నారు. నీవు పాస్పోర్ట్ల కుంభకోణానికి వారసుడవు, ఆర్మూర్ చౌరస్తాలో నడిరోడ్డుపై పట్ట పగలే ట్రాక్టర్ తో సేపూరు వ్యక్తులను ఇద్దరినీ హత్య చేయించిన ఘనుడవు వన్నీ మరచి నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ఎట్లా అని ప్రశ్నించారు. ఇకనైనా సాధ్యమైతే రాష్ట్ర సర్కారుకు సలహాలు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలి గాని బుడిబుడికలోడిలాగా పగటి వేషాలు వేయడం మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
Prev Post

