నిజామాబాద్ , ఫిబ్రవరి 10 (ప్రజాగళం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ పాషా డిమాండ్ చేశారు. అర్హులైన మహిళలకు జీవనోపాధి కింద కుట్టు మిషన్స్, రైతులకు రుణాలు, నిరుపేదలకు రేషన్ కార్డుల వెంటనే అందించాలని అల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇంక్విలాబ్-ఇ-మిల్లత్ (ఏఐఎంఐఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు..కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలాని కోరారు. కుట్టు పనులు వచ్చిన వారు కుట్టు మిషన్స్ లేక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని , రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వనందున రైతులు పంటలు పండించడానికి అప్పుల ఊబిలో కూరుకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు పండిస్తున్నారని వారిని ఆదుకోవాలని అయన డిమాండ్ చేశారు.,సామాన్య ప్రజలు రేషన్ కార్డుల లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుందన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ తక్షణమే సంక్షేమ ఫలాలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర సెక్రెటరీ జనరల్ అబ్దుల్ హలీం, జిల్లా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

