TSLSA ఆధ్వర్యంలో మానసిక రుగ్మతలపై వర్క్ షాప్

హైదరాబాద్ (ప్రజాగళం అర్బన్):
హైదరాబాదులోని రాజ్ భవన్ సంస్కృతి హాల్ నందు తెలంగాణ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీకి చెందిన NLSA ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు గౌరవ అతిథిగా అధ్యాపకుడిగా ప్రొఫెసర్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల పాల్గొని వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మానసిక రుగ్మతల గుర్తింపు పై లోతైన శిక్షణ అందిస్తూ ఆరోగ్యవంతమైన మరియు సుజ్ఞాన సమాజ నిర్మాణంలో మానసిక వైద్యుల కీలకపాత్రను వివరించారు. న్యాయ మధ్యవర్తిత్వ వ్యవస్థల్లో మానసిక ఆరోగ్య అవగాహన బలోపేతం చేయడం ద్వారా న్యాయ సేవకులకు మరింత సులభంగా చేరుకోవడానికి అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వర్క్ షాప్ లో రిటైర్డ్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి మహ్మద్ షమీం అక్తర్, ప్రముఖ మధ్యవర్తులు ఆసిఫ్, శ్రీమతి సీతాదేవి, TSLSA మెంబర్ సెక్రెటరీ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సేవలు సామాజిక సంక్షేమం కోసం కృషి చేస్తున్న న్యాయాన్నిపుణులతో చర్చించడం నాకు గొప్ప అవకాశం గా భావిస్తున్నాను అని డాక్టర్ విశాల ఆకుల తెలిపారు న్యాయవ్యవస్థ మరియు మానసిక ఆరోగ్య రంగాల మధ్య మైత్రిని బలోపేతం చేయడం ద్వారా సానుభూతితో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.