మార్కెట్ కమిటీ చైర్మన్ ను ముట్టడించిన హమాలీలు. దొంగలు అని నిందలు వేయడం పై మండిపడ్డ హమాలీలు. మధ్యాహ్నం వరకు స్తంభించిన పసుపు క్రయ, విక్రయాలు.

నిజామాబాద్ ఫిబ్రవరి 15 (ప్రజాగళం ప్రతినిధి )

నిజామాబాద్ మార్కెట్ యార్డ్ వ్యవహారం రచ్చగా మారింది.శనివారం మార్కెట్ యార్డులో దాదాపు రెండు గంటల పాటు హమాలీల ధర్నా చేశారు.. గత కొద్ది రోజుల నుండి నిజామాబాద్ మార్కెట్ కమిటీకి, కార్మికులకు మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమున్నాయి.. మార్కెట్ యార్డ్ లో ఉన్న అన్ని సంఘాల కార్మికులు మార్కెట్ కమిటీ చైర్మన్ కి వ్యతిరేకంగా ధర్నా చేయడం చర్చకు దారితీసింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని విషయంపై కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఒక దశలో చైర్మన్ వచ్చి మాట్లాడినంత వరకు తగ్గేదేలే అంటూ కార్మికులు మొండిచేయడంతో పసుపు విక్రయాలపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రైతు ఆరుగాలం పండించిన పంట ను మార్కెట్ యార్డుకు తీసుకొస్తే మార్కెట్ కమిటీ ధర నిర్ణయించిన తర్వాత రైతును పక్కన కూర్చోబెట్టి పంటను సరైన విధంగా తూకం చేసి రైతును సంతోషంగా ఇంటికి పంపించే కార్మికుల పట్ల దొంగతనాలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొంతమంది మార్కెట్ యార్డ్ పాలకవర్గంలో కొంతమంది సభ్యులు కార్మికులను మార్కెట్ యార్డును ఆబాసు పాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని దానిలో భాగంగా కార్మికులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమను దొంగలుగా చిత్రీకరించిన వ్యక్తులు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాత్రి రెండు గంటల సమయంలో మార్కెట్ యార్డ్ ను సందర్శిస్తున్నానని అంటున్నారని చైర్మన్ ఇప్పటివరకు ఎంతమంది దొంగలను పట్టుకున్నారు తెలుపాలని అన్నారు. మార్కెట్ యార్డులో కార్మికులు దాదాపు 40, 50 సంవత్సరాల నుంచి రైతులు సేవలు అందిస్తున్నారు కాబట్టి జిల్లా నుండి కాకుండా పక్క జిల్లా నుంచి కూడా రైతులు తమ పండించిన పంటలు యార్డుకు తీసుకొస్తున్నారని పంట యార్డుకు తీసుకొచ్చిన మొదటి రోజు తూకం కాకపోయినా రైతులు కార్మికుల పై నమ్మకంతో పంటను అక్కడే వదిలేసి వెళ్తున్నారని తిరిగి మరుసటి రోజు వచ్చి తూకం వేయించుకుంటున్నారని వెల్లడించారు.అంత నమ్మకంగా ఉండే కార్మికులకు కార్మికులపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అసలు కార్మికులపై దొంగలుగా నిందలు మోపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులతో మాట్లాడడానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డిని కార్మికులు ముట్టడించారు. అప్పటికి ఆగ్రహంతో ఉన్న కార్మికులు సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీనివాస్ పై దాడి చేయడంతో పోలీసులు శ్రీనివాసులు ను పోలీసు వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. మధ్యాహ్న అనంతరం మార్కెట్ యార్డులు పసుపు క్రయ విక్రయాలు యధావిధిగా కొనసాగాయి.

Leave A Reply

Your email address will not be published.