ముధోల్(ప్రజాగళం అర్బన్):
నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముధోల్ విద్యార్థినిలు అత్యంత ప్రతిభ కనబరిచి అర్హత సాధించారని ప్రధానోపాధ్యాయురాలు గీతా మేడం ఒక ప్రకటనలో తెలిపారు. కుమారి ప్రతిక్ష, మేఘన, పూజ ముగ్గురు విద్యార్థినిలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు వీరికి ప్రభుత్వపరంగా స్కాలర్షిప్స్ అందుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం మా పాఠశాల విద్యార్థులు ఏదో ఒక రంగంలో ప్రతిభ కనబరుస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అభినందించారు.

