మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య ఉద్యొగిని వెంటనే రిలీవ్ చేయాలి బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్

 

 

 

నిజమాబాద్ టౌన్ ప్రజా గళం ఫిబ్రవరి 22. .. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యొగి సల్మాన్ రాజ్ నిబంధనలకు విరుద్ధంగా ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న

వైద్య ఆరోగ్య ఉద్యొగిని వెంటనే రిలీవ్ చేయాలనీ .బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు

దండి వెంకట్ డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన మాతృ సంస్థ నుండి ఇతర సంస్థలోకి డిప్యూటేషన్ పై వెల్తే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు.

రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలోని డిప్యూటేషన్ లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నరు.

కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల డీజిల్ సెక్షన్ లో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యొగి సల్మాన్ రాజ్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ, గత 7 నెలల నుండి జీతం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ లో

పని చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి వారంరోజులు జీతం ఆలస్యం అవుతేనే కుటుంబం నడవడం కష్టమవుతుంది. అలాంటిది 7 నెలలుగా జీతం లేకుండా ఎలా పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ తక్కువగా పోస్తున్నారని మద్యలో వాహనాలు ఆగిపోతే డ్రైవర్ లే తమ జేబుల నుండి డబ్బులు పెట్టాల్సి వస్తుంది డ్రైవర్స్ తో కలిసి యూనియన్ తరుపున కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని

తెలిపారు.

వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లు వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యొగి సల్మాన్ రాజ్ ను రిలీవ్ చేయాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.