బాన్సువాడ ఫిబ్రవరి 23 ప్రజాగళం బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామంలో ఆదివారం బారడి పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి బారెడు పోచమ్మ గుడి వద్దకు తీసుకొని వచ్చి సమర్పించారు ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

