ఇంటర్ పరీక్షలకు వాచ్ ధరించి వస్తే.

 

బాన్సువాడ, మార్చ్ 1,ప్రజా గళం: మార్చ్ 5 నుండి ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోర్డ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు చేతికి వాచి ధరించి వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు పేర్కొంటున్నారు.వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించాలని బోర్డ్ భావిస్తోంది. ప్రతి పరిక్షాకేంద్రంలో సి.సికెమెరాలుఏర్పాటుచేస్తున్నారు. ఎంట్రీ గేటునుండి పరిక్షాకేంద్రం మొత్తం కవరయ్యేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిక్షలను ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని, విద్యార్థులు నిర్దేశించిన సమయానికి పరిక్ష కేంద్రానికి రావాలని, ఆలస్యమయితే పరీక్ష కేంద్రంలో అనుమతించమని, తప్పని సరిగా హాల్ టికెట్ తీసుకుని రావాలని సూచిస్తున్నారు. అదేవిధంగా విధ్యార్థులు వాచ్ ధరించి వస్తే పరిక్ష కేంద్రంలోనికి అనుమతించమని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.