బర్డ్ ఫ్లూ తగ్గింది…చికెన్ తినొచ్చు!

 

బాన్సువాడ, మార్చ్ 6 ప్రజా గళం: ఆదివారం వచ్చిందంటే చాలు మాంస ప్రియుల ఇంట్లో మాములుగా చికెన్ తినని వారు ఉండరు. ఈమధ్య బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో నెలరోజుల పాటు కోడిమాంసం, గుడ్లు వ్యాపారం పడిపోయింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ పేరు చెప్పగానే వణుకు పుట్టె పరిస్థితి ఏర్పడింది. దీంతో మటన్, చేపల మార్కెట్లో క్యూలైన్లో నిలబడి కొనుక్కునే పరిస్థితి. అంతేకాకుండా చికెన్ మాంసంపై ఆధారపడి జీవిస్తున్న హోటళ్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నెలరోజులుగా వ్యాపారం నడువక మూలనపడ్డ పరిస్థితి. ఈమధ్య ప్రజలకు అవగాహన కల్పించడానికి పౌల్ట్రీ ఫాం యజమానులు, చికెన్ సెంటర్ నిర్వాహకులు కలిసి పలు పట్టణం కేంద్రాల్లో చికెన్ మేళా నిర్వహించి బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది, ఇంకా నిర్భయంగా చికెన్ తినొచ్చు అంటూ అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిమాంసం గరిష్ట ఉష్ణోగ్రతలో ఉడికించి తినడంవల్ల ఒకవేళ వైరెస్ ఉన్న నషిస్తాయని, గుడ్లు కూడా పూర్తిగా ఉడకబెట్టి తినవచ్ఛని వైద్యులు చెబుతున్నారు. కాకపొతే ఈ ఉచిత చికెన్ మేళా నిర్వహించగా జనం వాటికోసం పెద్ద సంఖ్యలో పాల్గొని చికెన్ వంటలు నిర్భయంగా తినడం విశేషం. చికెన్ వ్యాపారులకు మాత్రం ఇది సానుకూల పరిస్థితి అని చెప్పుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.