విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం.

బాన్సువాడ, మార్చి 6, ప్రజాగళం. డెంటిస్ట్ డే సందర్భంగా గురువారం బాన్స్వాడ లోని రాజారాం దుబ్బ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా పేస్టులు, పెన్నులు అందించారు. వైద్య శిబిరం నిర్వహించిన దంత వైద్యులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వాతి,సంతోష్ రెడ్డి,సౌజన్య, జీవన్,సుహాసిని,అనిల్ రెడ్డి,అమృత్ సాయి,సందీప్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు లచ్చిరాం, రమేష్ గౌడ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.