సుదర్శన్ రెడ్డిని విమర్శించే హక్కు ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షులు దినేష్ లకు లేదు. ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా. జిల్లాను ఎలా అభివృద్ది చేయాలో మాజీ మంత్రికి తెలుసు.

ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం కృషిచేసిన  సుదర్శన్ రెడ్డిని విమర్శించే హక్కు ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షులు దినేష్ లకు లేదని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వైసాక్షి సంతోష్ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీ ఆర్ఎస్, బిజెపిలు పదేళ్లు పాలించిన ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జవహర్ నవోదయ కలగానే మిగిలిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి సహకారంతో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జవహర్ నవోదయ కోసం కృషి చేశారని, ఈ విషయం తెలుసుకోకుండా మాజీ మంత్రిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా ,
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సరి కాదన్నారు. రూరల్ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ హయాంలోనే సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో రూరల్ నియోజకవర్గం లోని డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీకి చేసిన కృషి ఘనత సుదర్శన్ రెడ్డి దే అన్నారు. ఈ విషయాన్ని మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఏక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో సుదర్శన్ రెడ్డికి బాగా తెలుసని, బిజెపి నాయకులతో చెప్పించుకునే స్థితిలో లేరని అన్నారు. విలేకరుల సమావేశంలో సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల వెంకటేష్, జాయింట్ కార్యదర్శి అప్సర్, శీలమంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.