రోటరీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

రోటరీ క్ల బ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బర్కత్పురా నందు గల కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ ప్రేమలత పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను

రోటరీ సంస్థ జరుపుతుందన్నారు. నగరంలోని ప్రముఖ విద్యావేత్త రోటరీ క్లబ్ సభ్యులు ఎస్ ప్రసన్నకుమారి, ప్రముఖ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ జి పద్మిని రెడ్డి, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కల్పనా ఠాకూర్, ప్రముఖ ఫోక్ సింగర్ సీత హోంగార్డ్ తదితరులను ఘనంగా మొమెంటో శాలువాలతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బాస ప్రకాష్, శ్రీకాంత్ జవర్, భారత్ పటేల్, హరి ప్రసాద్, ఎం వి ప్రసన్న, రామకృష్ణ, ఆకుల అశోక్, జ్ఞాన ప్రకాష్, పవన్ పాండే, శ్రీరాంసోని, జుగల్ సోనీ, శ్రీనివాసరావు, బాబురావు, రామ్మోహన్ రావు, జితేంద్ర మాలాని తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.