ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. మీడియాను లోపలికి రాకుండా అడ్డుకున్న అధికారులు.

 

నిజామాబాద్ మార్చి 12

(ప్రజా గళం ప్రతినిధి)

అక్రమ వసూళ్లకు అడ్డగా మారిన ఆర్టిఏ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు జరిపి సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మీడియాను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. బయట గేటు వద్దే అధికారుల ఆదేశాలతో సిబ్బందిని కాపలా ఉంచి ఎవరిని లోనికి రాకుండా నియంత్రించారు. దీంతో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కార్యాలయం అధికారులే ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కో పనికి రేటు నిర్ణయించి బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈ వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. అనేక ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు ఏసిబి డి.ఎస్.పి శేఖర్ గౌడ్ నేతృత్వంలో ఈ దాడులు చేపట్టారు. అయితే బయట వేచి ఉన్న మీడియాకు మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి

సొదాల అనంతరం వివరాలు అందిస్తామని అప్పటివరకు మీడియాను అనుమతించేది లేదని అధికారులు చెప్పినట్లు కాపలాదారులు మీడియాకు వెల్లడించారు. దీంతో గంటల తరబడి మీడియా బయట వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.