బాన్సువాడ, మార్చ్ 14, ప్రజాగళం. తెలంగాణరాష్ట్రవ్యవసాయసలహాదారులుబాన్సువాడఎమ్మెల్యేపోచారంశ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హోళీ సంబురాలుజరుపుకున్నారు.హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి లతో కలిసి హోలి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి జరుపుకునే హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని,కామ దహనం చేసి,రంగులు చల్లుకుని,ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

