మద్నూర్, మార్చి 16, ప్రజాగళం. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదివారం ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో రోడ్డు సౌకర్యాలు లేక పల్లె ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రతి వాడకు సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ద్వేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలు శా లువతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, pacs చైర్మన్ శ్రీనివాస్ పటేల్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంత్ యాదవ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, నాయకులు హనుమంతరావు దేశాయ్, ప్రజ్ఞ కుమార్, మీలాన్, తుకారం, హనుమాన్లు, కొండగంగాధర్, గోపి, బాలు యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

