ప్రజా గళం: వర్ని రిపోర్టర్
వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ఉక్క పోతతో గత నాలుగు ఐదు రోజులుగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఇది వరకే నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో
రెండు మూడు రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతోపాటు తుఫాను ముప్పు కూడా ఉండవచ్చని హెచ్చరించింది. కాగ గురువారం నిజామాబాద్ చిరు జల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారి చిరు జల్లులు కురవడంతో మట్టి వాసనను ఆస్వాదించారు. ఎండలు విపరీతం ఉండటంతో వేడి వేడి కారణంగా అల్లాడిన ప్రజలకు సాయత్రం చల్లటి గాలి వేయడంతో కొంత ఉపశమనం లభించినట్లు అయింది. వడగండ్ల వాన పడే అవకాశాలు ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

