నిజామాబాద్ బ్యూరో మార్చ్ 20 ( ప్రజా గళం)
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా యంత్రాంగం పదో తరగతి పరీక్షల పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22915
విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 11418 బాలురు, 11239 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ తెలిపారు. పరీక్షల్లో భాగంగా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హాల్ టికెట్లు రానివారు www.vse తెలంగాణ. Gov. In web site లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలకు సంబంధించిన యూనిఫామ్ ను ధరించి పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సమయానికంటే గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అనివార్య కారణాలవల్ల విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న లోనికి అనుమతిస్తామని తెలిపారు. తప్పనిసరిగా 9.35 నిమిషాలకు పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో గల బుక్ స్టాళ్లను, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని డిఈఓ కోరారు.

