నిజామాబాద్ బ్యూరో మార్చి 26 (ప్రజా గళం)
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బుధవారం శాసనమండలి ఆవరణలో నిరసన తెలిపారు.
బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చే
శారు .

