నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
భారత రాజ్యాంగ నిర్మాత ఏదో ఒక కులానికో మతానికో కాదని అందరికీ సమానమని అభ్యుదయ సోషల్ వర్కర్ దళిత నాయకుడు బంగారు సాయిలు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో కొందరు కులస్తులు విగ్రహాన్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవానిపేట గ్రామంలో 2015 సంవత్సరంలోనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేశామని దీనికి అప్పటి సర్పంచ్ కమ్మ వ్యక్తి, వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం దీనిని అగ్రవర్ణాలకు చెందిన కమ్మ కులస్తులు కొందరు హైకోర్టు ను ఆశ్రయించి స్టే తీసుకువచ్చి అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2015లో అప్పటి గ్రామ సర్పంచ్ కమ్మ కులస్తుడు అని తెలిపారు. అంబేద్కర్ అందరివాడు దీనికి అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కు పిటిషన్ ఇచ్చామని తెలిపారు ఆయన స్పందించి గ్రామానికి వచ్చి పరిశీలించి ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సోషల్ వర్కర్స్ నాయకులు భవానిపేట మాజీ సర్పంచ్ లాలయ్య మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

