ప్రజా గళం వర్ని మార్చ్ 26:
వర్ని నుండీ బోధన్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పనులు జరుగుచున్నవని,ఇట్టి రహదారి మీద నిత్యం హైదరాబాద్ వరకూ చాలా వాహనాలు రాద్దిగా తిరుగతాయి. ఇట్టి పనులలో భాగంగా కొన్ని చోట్ల బ్రిడ్జి పనులు జరుగుచున్నాయి. అక్కడ పిల్లర్ల కోసం చాలా లోతైనా గోతులు తీసి పనులు చేపట్టారు.

కానీ అక్కడ నామమాత్రపు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సరియైన బోర్డులు లేకపోవడం వల్ల దూరం నుండీ కనబడక పోవడం వల్ల మొన్నిమధ్యనే ఒక లారీ పనులు జరుగుతున్న ప్రాంతానికి డైరెక్ట్ గా వెళ్లి ప్రమాదానికి గురి అయ్యింది.ఆ టైం లో పనిచేసేవారు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా సరయిన ప్రమాద సూచికలు దూరంనుండీ కనబడేలా ఏర్పాటు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.

