_ఫైలేరియా నైట్ శాంపిల్ సర్వే విజయవంతం_ *HEO రవి చందర్*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

ఇంద్రాపూర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో చేపట్టిన ఫైలేరియా నైట్ శాంపిల్ సర్వే విజయవంతం అయిందని 300 బ్లడ్ శాంపిల్స్ సేకరించడం జరిగిందని HEO రవి చందర్ తెలిపారు. ఇంద్ర పూర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని ఇందిరాపూర్, వడ్డెర కాలనీ, డ్రైవర్స్ కాలనీ, 80 క్వార్టర్స్

 

తదితర ఏరియాల యందు గ్రూపులుగా విడిపోయి ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు ఫైలేరియా నైట్ సర్వే బ్లడ్ శాంపుల్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో HEO రవి చందర్ తో పాటు MPHA (F) పుష్పలత, సంగీత, ల్యాబ్ టెక్నీషియన్ ఎండి. హుస్సేన్,

ఆశా వర్కర్లు స్వరూప, భార్గవి, చందన, విజయ, సంధ్య, సుమలత, చిత్ర తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఫైలేరియా నైట్ శాంపిల్ సర్వే విజయవంతం చేసినందుకు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రవిచందర్ సిబ్బందిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.