ఆర్మూర్, మార్చ్27( ప్రజాగళం ) ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురకంటీ చిన్నరెడ్డి చోరువతో చేపూర్ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీ లు స్కూల్ బిల్డింగ్ కొరకు దాదాపు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రోస్టింగ్ 73లక్షల మంజూరు పత్రాలు బుధవారం పిప్రి గ్రామంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం లో అందుకున్నారు . ఈ నిధులు ఇచ్చినందుకు వినయ్ రెడ్డి కీ చొరవ చూపిన సురకంటీ చిన్నారెడ్డి లకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, పల్లె (హరిపూర్) గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కవతి రాజేందర్ అలియాస్ రామ్ సన్ మాజీ ఉప సర్పంచ్ ఆగాలాదివిటి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి జన్నాపల్లి గంగాధర్, బద్దం రాజు, చిట్యాల పోశెట్టి, సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగి శాంతి, గంగసాయన్న, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

