రోటరీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం నగర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ – శ్రీ సార్వజనిక్ గణేష్ మందిర్ ప్రధాన అర్చకులు* పంచాంగము చదివి వినిపించారు రాశుల ఫలితాలను వివరించారు

శ్రీశ్రీ శ్రీ విశ్వావసు తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగని పురస్కరించుకొని స్థానిక రైల్వే గేట్ నందుగల శ్రీ సర్వజన గణేష్ మందిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. మొదట శ్రీ గణేష్ భగవాన్ గారికి పూజా కార్యక్రమం చేయించి తదనంతరకార్యక్రమంలో ప్రధాన అర్చకులు భక్తులు మరియు సభ్యులందరికీ పంచాంగ శ్రవణం ద్వారా రాశి ఫలాలు తెలియపరిచారు. క్లబ్ సభ్యులందరూ కూడా భక్తజనానికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పులిహోర మరియు పచ్చడి ప్రసాదాలను అందించడం జరిగినది.

ఈ క్రొత్త తెలుగు సంవత్సరాది మనందరికీ ఆయుః ఆరోగ్య సుఖసంపదలనూ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తదనంతరం ప్రధాన అర్చకులకు కమిటీ సభ్యులకు శాలువాలతో సత్కరించడం జరిగినది. కార్యక్రమంలో రోటరీ సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, నర్సింగరావు, గురుప్రీత్ సింగ్, బెజగం అశోక్, వీరేంద్ర పార్మర్, గోపాల్ జవహర్, గణేష్ గుప్తా, కటకం శ్రీనివాస్, రమేష్ గిల్డ, కమల్ గిల్డ, అతుల్ మంగే, ఆకుల అశోక్, శివ పవర్, జ్ఞాన ప్రకాష్, రాజ్ కుమార్ సుబేదార్, పద్మ, ఆర్తి, అనుపమ సుబేదర్ తదితరు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.