మద్నూర్, ఏప్రిల్ 1, ప్రజాగళం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ జుక్కల్ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా మండలాలు, గ్రామాల్లో సన్నబియాన్ని పంపిణీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో లక్షలాది మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మద్నూర్ మండలం పెద్ద ఎకర్ల గ్రామంలో ప్రజాప్రతినిధులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు దేశాయ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు శంకర్ పటేల్, వెంకట్ పటేల్ హాట్ కార్, ముంగిడే బశ్వంత్, సోమవార మహేష్, రేషన్ డీలర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

