బాన్సువాడ, ఏప్రిల్ 5, ప్రజాగళం.
బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో సప్తహ ఘనంగా నిర్వహించారు. చైతణ్య మహారాజ్ ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలు కొనసాగుతున్నాయి. వారం రోజులపాటు సప్తహ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చైతన్య మహారాజును కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశముఖ్, మదేళ్లి లక్ష్మన్ మహారాజ్, సాయిరెడ్డి, పున్న సాయిలు, అంజగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విట్టల్, దత్తు, లక్ష్మన్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

