పల్లెటూరి వాతావరణం, గొర్ల క్యాపర్ల వ్యధలు

బైంసా (ప్రజాగళం అర్బన్):

ఆహ్లాదకరం, గొర్లు మేకలు బర్లు , పశువులు చెట్లు పొలాలు పంటలు వీటన్నింటితో ప్రకృతి అందాలు సినిమా కంటే అద్భుతంగా రియల్ గా కనిపిస్తున్నాయి. ఈ ప్రకృతి పశువులు పచ్చదనము పంటలు గొర్లు బర్లు వాటి మేళవింపే భైంసా మండలంలోని మహాగాం గ్రామం. అక్కడ 200 కు పైగా గొర్లు మేకలతో పశువుల కాపరులు పగలు మూడు గంటల ప్రాంతాన వేప చెట్టు నీడన మేకలను గొర్లను నిలిపి సేదదేరుతున్నారు. గొర్లను మేకలను పెద్ద వేప చెట్టు నీడకు చేర్చారు, ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నాయి అవి హాయిగా వేప చెట్టు నీడన సేద తీరుతున్నాయి. ప్రజా గళం విలేకరి చందుకు తారాస పడడంతో క్లిక్ పంపించాడు కెమెరాను. కాపరుల దగ్గరికి వెళ్లి ముచ్చటించారు. హనుమంత్ రేపన్, ద్యారంగుల భీమన్నలు గొర్ల కాపర్లు వారికి సంవత్సరానికి గొర్ల యజమానులు గంగారాం శంకర్ లు 1,20,000 చొప్పున ఇద్దరికీ జీతం ఇస్తున్నాడని అడవిలకు పోతే భోజనం కూడా వారే అరేంజ్ చేస్తారని తెలిపారు. రోజు సాయంత్రం ఫలానా చోట ఉన్నాము అంటే అక్కడకు యజమానులు వస్తారు వారికి అప్పగించి మా ఇంటికి వెళ్ళిపోతామని తెలిపారు. రాత్రి యజమానులే గొర్రెను అక్కడే కాపలా పడుకొని చూస్తుంటారు. ఇంతలో కృష్ణ అనే అబ్బాయి సూది బుడ్లు ఇంజక్షన్ సిరంజి తీసుకొని వచ్చాడు. ఒకటి క్లోరోఫినరమిన్ వాయిల్ మరోకటి బి కాంప్లెక్స్ వాయిల్. గొర్లు సేద తీరిన చోట వాటిని గమనించి ఏ గొర్రె సుస్థి ఉందనిపిస్తే వాటికి 1ml చొప్పున రెండు ఇంజక్షన్లు చేస్తారు, వారే డాక్టర్లుగా వ్యవహరిస్తారు. గొర్ల నడవడితో ఏది మెత్తబడిందో తెలుసుకొని వాటికి ఇంజక్షన్ చేస్తామని తెలిపారు. కృష్ణకు 14 ఏళ్లు ఉంటాయి అతనికి ఏడాదికి

70 వేల జీతము యజమానులు ఇస్తారని తెలిపారు. గొర్లు బర్లు ఆవులు పచ్చని పంటలు పచ్చని చెట్లు వీటన్నిటిని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది అని ప్రజాగలం విలేకరి తెలిపారు. గొర్ల కాపర్లకు ప్రభుత్వము ఆర్థిక సహాయం లోన్ ఇప్పిస్తే మేమే గొర్లను కొనుగోలు చేసి పెంచుతాము మేపుతాము అన్నారు. అప్పుడు మేమే యజమానులం అవుతాము అని తెలిపారు. మేకలు ఈనుతాయి పిల్లలు పుట్టి వృద్ధి చెందుతాయని తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ వారికి సహాయం చేసి ఆదుకోవాలని నిజమైన పేదవారికి పని చేసే వారికి సహాయం చేసినట్లు అవుతుందని ప్రజాగళం ప్రతినిధి “చందు” తెలిపారు. అధికారులు రాజకీయ నాయకులు స్పందించి గొర్ల కాపరులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.