గుండెపోటుతో బాన్సువాడ పోలీసు హోంగార్డు మృతి

బాన్సువాడ, ఎప్రిల్ 8 ప్రజా గళంః బాన్సువాడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న డి సాయిలు (55) గుండె పోటుతో మృతిచెందాడు. ఆయన సోమవారం విధులు నిర్వహించి స్వగ్రామమైన దేశాయిపేట్ లోని తను ఇంటికి వెల్లిన తరువాత ఒక్కసారిగ ఛాతినొప్పి రావడం తో కుటుంబ సభ్యులు హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రి కి తరలించారని, చికత్స చేస్తున్నసమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో మృతిచెందాడని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.