నిజామాబాద్ టౌన్ ప్రజా గళం ఏప్రిల్ 8. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనం లో నిజమాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం
హెల్త్ క్యాంపు
నిర్వహించడం జరిగిందనీ.జిల్లా ఉమెన్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు బైస సంగీత తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల ,కేశ వేణు నుడా చైర్మన్, నీతూకిరణ్ మాజీ మేయర్ హాజరై. జిల్లా జడ్జి హెల్త్ చెకప్ కార్యక్రమం ప్రారంభించి .ఈ సందర్బంగా జిల్లాజడ్జి సునీతా కుంచల మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలోకి మహిళలు రావడం మగవారికి ధీటుగా మహిళా జర్నలిస్ట్ లు పనిచేయడం తో పాటు ఇలాంటి స్వచ్చంద కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం అని తెలిపారు .జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ నుండి ఇక మునుముందు కూడాఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమని తెలిపారు.అనంతరం .

నుడా చైర్మన్ కేసు వేణు మాట్లాడుతూ ….మహిళా జర్నలిస్టు అసోసియేషన్ గా ఉన్న బైస సంగీత అందరికి సుపరిచితురాలు ఆమె సీనియర్ కూడా వారి ఆధ్వర్యంలో నిజామాబాదు జిల్లా ఉమెన్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించడం నిర్విఘ్నంగా మొదటి సంవత్సరం పూర్తిచేయడం ఎంతో ఆనoదదాయకం అని తెలిపారు.అందరు జర్నలిస్ట్ ల గురించి ఇటువంటి సామజిక దృక్పధంతో ఆలోచించి జర్నలిస్ట్ ల హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదని అన్నారు.
మాజీమేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ…ఈ రోజుల్లో వాళ్ళ గురించి వల్లే ఆలోచించడం తప్ప ఇతరుల గురించి ఆలోచించరు అలాంటిది తన తోటి జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మెచ్చుకోదగిన విషయం అని తెలిపారు..మంచి కార్యక్రమం లో .హెల్త్ చెకప్ చేసిన వైద్యులు డాక్టర్
కట్ట నర్సింహా,న్యూరో సర్జన్, డాక్టర్ హరి కృష్ణ రెడ్డి కిడ్నీ స్పెషలిస్ట్, డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్, డాక్టర్ శ్రీనివాస్ యూరాలజీ డాక్టర్ ,ఆదిత్య ఆర్థో సర్జిం, డాక్టర్ హితేష్ కుమార్ డయాబెటిస్ డాక్టర్,విశ్వనాథ్ జనరల్ , డాక్టర్.కృష్ణమూర్తి కంటి నిపుణుల స్పెషలిస్ట్ అధునాతన పరికరాలతో డాక్టర్స్ ఈ హెల్త్ క్యాంపు నిర్వహించి సేవలందించారనీ తెలిపారు.ఇందుకు అసోసియేషన్ సభ్యులు గౌరవ ముఖ్య అతిధులను,డాక్టర్లను,సీనియర్ జర్నలిస్టులను సన్మానించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉమెన్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు బైస సంగీత ,జిల్లా ఉమెన్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు బైస సంగీత ,రిటైర్డ్ ఎంప్లొయీస్, మరియి జర్నలిస్టులు పాల్గొన్నారు.

