బాన్సువాడ, ఏప్రిల్ 13, ప్రజాగళం.. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలానికి చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.దీంతోపాటునసురుల్లాబాద్ మంలానికి చెందిన నలుగురు లబ్ధిదారు లకు ముఖ్యమంత్రి సహాయ నిధి( CMRF ) చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలోనసురుల్లాబాద్ మండల ప్రజా ప్రతినిధులతో పాటు ,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

