నేను కొంచెం రౌడీ టైపు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోను.. ఎమ్మెల్సీ కవిత.

 

బాన్సువాడ, ఏప్రిల్ 15, ప్రజాగళం. బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సౌమ్యుడని, నేను మాత్రం కొంచెం రౌడీ టైపేనని ఏమ్మెల్సీ కవిత అన్నారు.బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేస్తామని, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ మహాసభ సందర్బంగా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రజతోత్సవ మహాసభకు ఇంటికొకరు చొప్పున

తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పే ప్రభుత్వమని, ఇక్కడి నాయకులు డబ్బు కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారని ధ్వజమెత్తారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, కార్యకర్తల జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని హెచ్చరించారు. నేను కొంచెం రౌడీనే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదని, ప్రజలకు మంచి, అభివృద్ధి చేశామన్నారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన మా కార్యకర్తలకు భయపట్టిస్తే భయపడేది లేదనిహెచ్చరించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరు అధైర్య పడవద్దు అని అన్నారు.15 నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.