ఇంటర్ ఫలితాల్లో వెక్టార్ విద్యార్థుల హవా -90 ప్లస్ విద్యార్థుల ఉత్తిర్ణత

 

నిజామాబాద్, ఏప్రిల్ 22( ప్రజాగళం )

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు.

నిజామాబాద్ వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో లో గౌరవ్ శర్మ 466/470., మణిచంద్ర 466/470., బత్తుల వంశి 466/470, పోతులఆశ్రిత -466/470., మనస్విని 466/470., ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో మామిడి నిశాంత్ రెడ్డి 991/1000,.బైపీసీ రెండవ సంవత్సరంలో మందలోజు శ్రీవర్షిని 989/1000,మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఛైర్మెన్ మధుసూధన్ జోషి తెలిపారు. అత్యంత కఠినమైన జేఇఇ,నీట్ ఫలితాల్లోను అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ,ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం తమ విద్య సంస్థకు గర్వకారణం అని అన్నారు. ఈ సందర్బంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు సంగం సంతోష్, కందొల్ల గజానంద్, కొండవీటి కార్తిక్ లు సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.