బాన్సువాడ, ఏప్రిల్ 26, ప్రజాగళం. నిరుపేదలు గుడిసెల్లో ఉండకూడదని, పక్కా గృహాలే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ గృహాల పేరిట లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తూ చేయూతనిస్తున్నామన్నారు. శనివారం బాన్సువాడ పట్నంలోని పోచారం స్వగృహంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. బీర్కూరు మండల కేంద్రానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు 37,70,935 రూపాయల చెక్కులు పోచారం అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు ఎజాజ్, రఘు, శశికాంత్, బాబా, సందీప్ పటేల్,యామరాములు, బోయిని శంకర్, బీర్కూరు మండల ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

