నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
నేడు స్థానిక బర్కత్పురా నందు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకై ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బెరెల్లి విజయరావు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్, b రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైవ్ సిటీ మరియు షార్ ప్రాజెక్ట్స్ వారి సహకారంతో ఈ వీల్ చైర్లను అందించడం జరిగిందని, ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ గవర్నర్ జ్ఞాన ప్రకాష్ హాజరై మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ సంస్థ శివ దృక్పథంతో ఆశయాలను నెరవేరుస్తుందని దీనిలో భాగంగా ఈరోజు వీల్ చేర్లను అందించడం గొప్ప విషయమని, దివ్యాంగులు మానసిక ధైర్యం కోల్పోవద్దని మనోధైర్యంతో ముందడుగు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కార్యక్రమ కార్య నిర్వహణ అధికారి గోవింద్ జవహర్, బెజగం అశోక్, b పార్సి రాజేశ్వర్, శ్రీకాంత్ జవహర్, శ్రీరామ్ సోనీ, గణేష్ గుప్తా, శ్యాం అగర్వాల్, పవన్ పాండే తదితరులతోపాటు బాధితుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

