నిజామాబాదు ప్రజాగళం రూరల్ : మే 19
డొంకేశ్వర్ మండలం నీకాళ్పూర్ గ్రామంలో మే 14 నుండి ఈరోజు వరకు శ్రీ వెంకటేశ్వరా స్వామి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమాలు అంగరంగ వైభవం గా జరిగాయి.ఈ ఐదు రోజులు ఊరు అంత పండుగ వాతావరణం ల మారింది.ప్రతి రోజు ఉదయం,రాత్రి కి ఆలయ,గ్రామ అభివృద్ధి కమిటీలా ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.ప్రతి రోజు వేద పండితుల మంత్రోచ్ఛరానులతో,భక్తుల భజనలతో,గోవిందా గోవిందా నామస్మరణ లతో ఊరంతా మార్మ్రోగింది.అలాగే

ఆలయ నిర్మాణానికి తోడ్పాటుగా విరాళాలు ఇచ్చిన వారిని శాలువాలతో సత్కరించారు. ప్రతిరోజు మహిళలు మంగళ హారతిలతో పూజాలో అదిక సంఖ్య లో పాల్గొన్నారు. గ్రామంలోని యువకులు మాల ధారణ చేసుకొని నిత్యం స్వామి వారి పూజలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో

ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి ఈ ఊరి పుట్టింటి బిడ్డలని అందరిని పిలిపించుకొని తల్లి గార్లు బట్టలు చేశారు. ఈ ఐదు రోజులు పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల నుండి వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

