నిజామాబాద్ , జూన్ 03(ప్రజాగళం)
జిల్లా కేంద్రంలోని ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు రోగికి జీవం ప్రసాదించారు. మంగళవారం ప్రెస్టేజ్ ఆసుపత్రిలో ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ రాజ్, నెఫ్రాలజీ వైద్యులు మోసిన్ లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన నవీన్ (35) శరీరంలోని ప్రధానమైన అవయవాలైన కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు.
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మనిషి ఒకేసారి చావు బతుకుల మధ్యకు పోవడంతో కుటుంబసభ్యులు చివరి నిమిషంలో ప్రెస్టేజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆసుపత్రి వైద్యులు రోగి చికిత్స పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపి సకాలంలో వైద్యం అందించి రోగి ప్రాణాలు కాపాడారు.. వైద్యులు అందించిన సేవల పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. లక్షల్లో ఒకరికి మాత్రమే నరాల బలహీనతకు సంబంధించిన గులియం బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకుతుందని నవీన్ అనే పేషెంట్ కు ఈ వ్యాధి సోకడం విచారకరమన్నారు. గుండె కిడ్నీ నరాల బలహీనత వంటి ప్రధానమైన అవయవాలతో బాధపడుతున్న నవీన్ కు మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. డయాలసిస్తో కిడ్నీ ఫంక్షనింగ్ చేయడంతో పాటు నరాల బలహీనత, హార్ట్ ,కిడ్నీ, లివర్ ఫంక్షన్ ను మెరుగుపరచామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్యంతో మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశామని ప్రతిమ రాజ్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు వినోద్,డైరెక్టర్ కైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

