బోర్లంలో బడిబాట…

బాన్సువాడ, జూన్ 6, ప్రజాగళం.

బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ మాజీ ఎంపిటిసి సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని

సూచించారు. ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్ధం అన్ని వసతులు కల్పిస్తున్నారు అన్నారు. పాఠశాలలో గత నెల రోజులుగా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పదిమంది నిరుపేద విద్యార్థులకు ఆమె ఆర్థిక

సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మన్నె విటల్, పద్మ శ్రీనివాస్, సరిత, హమీద్, నరసింహాచారి, రత్తయ్య, గంగాధర్ ఇతరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.