నిజామాబాద్, జూన్ 07( ప్రజాగళం )
సమాజంలో మార్పులు తీసుకువచ్చేది కవుల జీవన విధానమేనని నగర ఎమ్మెల్యే ధన్ పాల్ నారాయణ అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ మందిరంలో రచయిత ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మ జీవి కవితా సంపుటిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఇందూరు జిల్లాకు చెందిన ప్రముఖ జాతీయ కవి శ్రీమన్నారాయణ చారి విరాట్ కర్మజీవి పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మ జీవి కవితా సంపుటిలో జీవనగమనంలో కనిపించే సన్నివేశాల్ని చక్కగా రచించాడని ఇప్పకాయల సుదర్శన్ ను అభినందించారు. మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపున బిడ్డగా జన్మిస్తాను అంటూ ఈ కర్మ జీవి కవిత సంపుటిని తన అర్థాంగికి అంకితం ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.
అష్టావదాని డా: గణపతి అశోక శర్మ, సభా సామ్రాట్ ప్రముఖ కవి వి పి చందన్ రావు, ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డా: కాసర్ల నరేష్ రావు,సంస్కార భారతి రాష్ట్ర సాహిత్య విద్యా ప్రముఖ్ గంట్యాల ప్రసాద్, ఆత్మీయ అతిథి డా :బొద్దుల రాజేంద్రప్రసాద్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంటం దత్తాద్రి, కార్యదర్శి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

