ఎస్టీలకు క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పించండి. ఉమ్మడి జిల్లాల బంజారా సంఘం సదర్ నాయకులు రాజు నాయక్.

నిజామాబాద్ జూన్ 9 ( ప్రజా గళం ప్రతినిధి)

 

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా సదర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా, లంబాడ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని,అదేవిధంగా ఎస్టీలకు క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించలేకపోతున్నార ని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీలకు సముచిత న్యాయం కల్పించాలని కొరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్టీలు వెన్నుదన్నుగా నిలిచారని, దీనిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అంతగా ప్రాధాన్యత లేని డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ పదవులు కాకుండా క్యాబినెట్లో పదవులు కేటాయించి సరైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. మేము ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీ నాయకులమే అని , మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అని, మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగానే ఉన్నామని, బంజారాలకు సరైన హోదా కల్పించి మా సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, మోహన్ నాయక్, కైలాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.