రాజన్న కోడెల మరణాలపై రేవంత్ రెడ్డి స్పందించాలి. ఆలయాల అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

నిజామాబాద్ జూన్ 9 ( ప్రజా గళం )

 

 

వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలయాల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కవిత కోరారు.

ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. డిచ్ పల్లి లోని ఖిల్లా రాములయాన్ని ఎమ్మెల్సీ కవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ

బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామన్నారు.

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రూ 2 వేల కోట్లు ఖర్చు చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు.

మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు.

కల్యాణలక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలిని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.