నిజామాబాద్ సిటీ జూన్ 15 ( ప్రజా గళం )
నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో గౌడ అఫీషియల్స్, అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థిని విద్యార్థులకు టెన్త్,, ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయ గౌడ్ హాజరై మాట్లాడుతూ గౌడ సంఘం విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఉత్తమంగా చదివి ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులకు గౌడ సంఘం హాస్టల్లో వసతితో పాటు ఉచిత విద్యకు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చక్రధర్ గౌడ్, ఎస్ ఎస్ ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, సత్య గౌడ్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

