ఆర్ఎంపి పై దాడి కుట్రలో భాగమే. -మీడియా సమావేశంలో ఆర్ఎంపి, పిఎంపిల నాయకుల వెల్లడి

 

నిజామాబాద్ , జూన్ 18 ( ప్రజా గళం ప్రతినిధి )

తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ర్యాలీలో జరిగిన దాడి సంఘటన కుట్రలో భాగమేనని ఆర్.ఎం.పి,పి, .ఎం.పి ల నాయకులు ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన శాంతియుతంగా నిర్వహిస్తున్నా ర్యాలీలో జరిగిన సంఘటన తమకు ఆందోళన కలిగించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 429 జీవో ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ కల్పించి వైద్యులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ,పి ఏం పిలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమలోని ఐక్యతను చూసి ఒర్వలేని కొందరు శాంతియుతంగా చేస్తున్నా ర్యాలీని భగ్నం చేసేందుకు కుట్రపూరితంగా కొందరు నాయకులు మహిళను రెచ్చగొట్టి తమ పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడుగా కొనసాగుతున్న అశోక్ పై మహిళ దాడి చేయడం హేయమైన చర్యని తాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తామంతా డాక్టర్ అశోక్ కు మద్దతుగా జిల్లా సీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బోధన్ ఆర్ఎంపీ, పిఏంపిల అధ్యక్షులు రాజా గోపాల్ చారి, ఆర్మూర్ శ్రీనివాస్, చందు, సాయిలు, ఖలీల్,అజార్, మోస్రా గంగారెడ్డి, బొద్దుల మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.