బాన్సువాడ, జూన్ 18, ప్రజాగళం.
బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ భూమి చేశారు. నిబంధనలకు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సంవత్సరంలో నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, విడతలవారీగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు. అనంతరం పాత బాన్సువాడలోని సహకార సంఘం చౌక ధరల దుకాణంలో సన్న బియ్యని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు, డిఎల్ పిఓ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

