నిజామాబాద్ సిటీ జూన్ 19 ( ప్రజాగళం )
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా వైస్ చైర్మన్ గా మాచర్ల సాయికిరణ్ గౌడ్ నియామకమయ్యారు.సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్, నేషనల్ జనరల్ సెక్రెటరీ డా. గంప హనుమ గౌడ్, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ నవీన్ కుమార్, తెలంగాణ స్టేట్ సెక్రెటరీ బట్టి దత్తాద్రిగౌడ్, తెలంగాణ స్టేట్ లీగల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ రమేష్ లు జిల్లా వైస్ చైర్మన్ గా మాచర్ల సాయికిరణ్ గౌడ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వర్కింగ్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

