మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి. కాసుల.

బాన్సువాడ, జూన్ 19, ప్రజాగళం.

బాన్సువాడ నియోజకవర్గంలోని మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని, సంఘము అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలానికి చెందిన మున్నూరు కాపు అధ్యక్ష కార్యదర్శులు గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కాసుల బాలరాజును ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్నూరు కాపులుఐక్యంగా ఉండాలనిప్రతిగ్రామంలోమున్నూరుకాపుకళ్యాణమండపాలఏర్పాటుకుకృషిచేస్తానన్నారు.ప్రభుత్వం ద్వారా రావలసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలన్నారు . జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీరాజకీయపరంగావెనుకబడ్డారన్నారు.మున్నూరు కాపులకు ఏ కష్టం వచ్చినా మీ ముందు ఉండి ఎల్లవేళలా సహకరిస్తానన్నారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యామ రాములు, మున్నూరు కాపు మండల అధ్యక్షుడు మేకల విటల్,ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.