నిజామాబాద్ , జూన్ 20( ప్రజాగళం ప్రతినిధి)
నిజామాబాద్ నగరంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు గురించి మాట ఇచ్చినం మాట నిలబెట్టుకుంటామని,నెల రోజుల్లో నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
అన్నారు. ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు నిజామాబాద్ నుంచి తరలి వెళ్ళారు. జర్నలిస్టుల ఎన్నో ఏళ్ల కళ, సొంతింటి కల సాకారం చేయాలని శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బంజారాహిల్స్ షబ్బీర్ అలీ లను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా

సన్మానించారు. నివాసయోగ్యం కానీ గుండారం గుట్టలు కాకుండా నగరానికి సమీపంలో నివాసయోగ్యం కలిగిన స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వాలని చేసిన డిమాండ్ పట్ల ఇరువురు సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుండారం భూములు జర్నలిస్టుల నివాస స్థలాల కోసం ప్రతిపాదించారాదని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి, ఆర్డిఓ రాజేందర్ కుమార్ లకు సూచించారు. గుండారం గుట్టలకు బదులుగా ప్రత్యుమ్నయ భూములను వెంటనే గుర్తించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇండ్ల స్థలాలతోపాటు ఇండ్ల నిర్మాణం కోసం సహకరిస్తామని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా నగర జర్నలిస్టులు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

