ఆర్టీసీ బస్సు డి ఒకరి మృతి

ఆర్మూర్,జూన్ 26 (ప్రజాగళం) ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పెర్కిట్ కొటార్మూర్ 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం కరీంనగర్ వైపు నుండి ఆర్మూర్ కు వస్తున్న జగిత్యాల కు చెందిన ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ అతి వేగంతో అజాత్రగా నడుపుతూ బైక్ పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుండి ఢీకొడంతో అక్కడక్కడే మృతి చెందాడు స్థానిక ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మామిడి మహేష్,(38) ఆయన భార్య మామిడి లావణ్యను మహిళ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తుంది

అయితే ఉదయం ఎనిమిది గంటలకు మహిళా ప్రాంగణంలో భార్యను దించి వస్తున్న మార్గంలో ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో అక్కడక్కడే మృతి చెందారు మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నట్లు తెలిసింది మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.