ప్రాణదాతలకు సన్మానం.

బాన్సువాడ,జూలై 1,ప్రజా గళం. వైద్యుల దినోత్సవ సందర్భంగా సందర్భంగా ప్రాణదాతల సేవలను కొనియాడుతూ పలువురు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళవారం బాన్సువాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని పలువురు డాక్టర్లనుఘనంగా సన్మానించారు. వైద్యులు రాజశేఖర్ దంపతులు బాలాజీ హాస్పిటల్స్ వైద్యులు సంతోష్ రెడ్డి దంపతులు, అన్విత హాస్పిటల్స్ వైద్యులు అచ్చుకట్ల జీవన్ దంపతులతో పాటు వైద్యులుఅంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైన్స్ అధ్యక్షులు బెజగం వెంకటరమణ మాట్లాడుతు డాక్టర్స్ అంటే కనపడే దేవుళ్ళనివారిని సన్మానించడం ప్రతి ఒక్కరు బాధ్యత అన్నారు. వారిని సన్మానించడం ఎనలేని సంతోషం ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో లయన్స్ అంజిరెడ్డి, బునేకర్ ప్రకాష్,గణేష్ ,ఖలీద్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.