న్యాయం జరిగే వరకు పోరాటం.. కళ్ళు గీత కార్మికుడు విటల్ గౌడ్..

 

బాన్సువాడ, జులై 2, ప్రజాగళం.

కల్లు లైసెన్స్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని కళ్ళు గీత కార్మికుడు విట్టల్ గౌడ్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని మొగులాన్ పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన సొంత భూమిలో 15 సంవత్సరాల క్రితం 1200 ఈత మొక్కలు నాటానని,ప్రస్తుతం ఈతకు వచ్చాయని అన్నారు. హరిత హారంలో భాగంగా 2015లో అధికారులు 500 ఈత మొక్కలు ఇచ్చారని, 2009లో 700 ఈత మొక్కలు డబ్బులు వెచ్చించి తెచ్చి నాటానన్నారు. గ్రామంలో ఒకేఒక్క గౌడ కుటుంబం ఉందని, గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం తీసుకుని దరఖాస్తు చేస్తున్నప్పటికీ అధికారులు కనికరించడం లేదన్నారు. అబ్కారి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చెట్టు ఎక్కరాని వారికీ కూడా సీఐ లైసెన్సులు ఇచ్చారని, ఈతవనాలు పెంచి, చెట్లు గీసే అర్హత ఉన్నా లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. కల్తీ కల్లును ప్రోత్సహించనని, లైసెన్స్ ఇస్తే స్వచ్ఛమైన నీరా అమ్ముకుని జీవిస్తానని తెలిపారు. న్యాయం జరిగే వరకు ధర్నా కార్యక్రమాలు చేపడతానన్నారు. సమావేశంలో హరిదాస్, విట్టల్ సింగ్, రాజ మహారాజ్, సవాయి సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.