బాన్సువాడ, జులై 3, ప్రజాగళం.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్ధిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.తామంతా ఇళ్లలోఉంటున్నామనిఅధికారులకు వివరించిన,వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇళ్లకు తాళాలు వేయడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఇంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు.బీజేపీ నాయకుల పరామర్శవిషయం తెలుసుకున్న బీజేపీనాయకులులక్ష్మీనారాయణ, గంగారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లను అధికారులు మళ్లీ లాక్కోవడం హేయమైనచర్యగాఅభివర్ణించారు. తక్షణమే అధికారులు లబ్ధిదారుల ఇళ్లను అప్పగించాలని కోరారు.

